BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 12:36 pm
Posted by : SEETHA KIRAN KUMAR

OYO హోటల్‌లో 21 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Nov, 2026 - 12:36 PM
6 వీక్షణలు

పుట్టినరోజు వేడుక కోసం మైహర్‌కు వెళ్లిన యువతి.. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థత

ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు.. పోలీసుల దర్యాప్తు

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని మైహర్‌లో 21 ఏళ్ల యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ప్రియుడితో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు ఆమె మైహర్‌కు వెళ్లినట్లు సమాచారం. శారదాదేవి ఆలయం సమీపంలోని ఓ OYO హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అందిన వివరాల ప్రకారం.. యువతి తన ప్రియుడు, అక్క, మరో స్నేహితురాలు, మరికొందరు యువకులతో కలిసి మైహర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ మూడు గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రయాణం గురించి కుటుంబ సభ్యులకు తెలియకుండా వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ క్రమంలో తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో యువతి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆమె ప్రైవేట్ భాగాల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు ప్రియుడు తెలిపినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఆస్పత్రిలో యువతి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెంట వచ్చినవారు ప్రయత్నించగా, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. యువతి మృతి వెనుక కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.