BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 09:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:13 AM
40 వీక్షణలు

ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేసిన కేరళ ప్రభుత్వం

గుండె సంబంధిత సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలి.. వైద్య పరీక్షలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. మండల పూజ సీజన్ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజ సీజన్ డిసెంబర్ 27 వరకు కొనసాగనుండటంతో లక్షలాది మంది భక్తులు శబరిమల చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలున్న భక్తులు యాత్రకు బయలుదేరే ముందే వైద్యులను సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గుండె సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందిన తర్వాతే యాత్రకు వెళ్లాలని స్పష్టం చేశారు. కొండ మార్గంలో నడక, మెట్ల ప్రయాణం శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగించే అవకాశం ఉన్నందున తొందరపడకుండా నెమ్మదిగా ప్రయాణించాలని, మధ్యమధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. యాత్ర సమయంలో ఛాతిలో నొప్పి, తీవ్రమైన ఆయాసం, తల తిరగడం, అధిక చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితులు ఎదురైన వెంటనే సమీపంలోని వైద్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స పొందాలని స్పష్టం చేసింది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మొక్కుబడుల పేరుతో శారీరక సామర్థ్యానికి మించి కొండ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. భక్తులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లపై కూడా దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే 04735 203232 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు భక్తితో పాటు ఆరోగ్య భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా యాత్రను పూర్తి చేసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ సూచించింది.