BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 03:45 pm
Posted by : PAGADALA DEVAIAH

ప్రభాత్ నగర్ పార్కును కాపాడుకుంటాం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
05 Nov, 2026 - 03:45 PM
10 వీక్షణలు

పార్కు స్థలాన్ని వాకర్స్‌కు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం – గేటు ఏర్పాటు చేయకుండా అధికారుల దృష్టికి సమస్య

ఎల్బీనగర్, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 5:30 గంటలకు చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ పార్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో వాకింగ్ చేస్తున్న స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పార్కు విభజనపై వాకర్స్ ఆందోళన

ప్రభాత్ నగర్ పార్కులో ఎన్నో సంవత్సరాలుగా ప్రతిరోజూ వందలాది మంది స్థానికులు వాకింగ్ చేస్తున్నారని వాకర్స్ ఎమ్మెల్యేకు వివరించారు. అయితే, పార్కు పక్కనే నిర్మాణంలో ఉన్న టీమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పార్కు వద్ద గేటు ఏర్పాటు చేయనున్నట్లు తెలియడంతో ఆందోళన వ్యక్తం చేశారు. గేటు ఏర్పాటు చేస్తే వాకింగ్‌కు సరిపడా స్థలం లేకుండా పోతుందని, ఇప్పటికే ప్రజలు వినియోగిస్తున్న పార్కును రెండు భాగాలుగా విభజించడం సమంజసం కాదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

పార్కును కాపాడేందుకు కృషి చేస్తా

వాకర్స్ సమస్యలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో టీమ్స్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి, ఆసుపత్రి పరిధిలో పోలీస్ స్టేషన్, చిల్డ్రన్స్ పార్క్, వాటర్ ట్యాంక్, సబ్‌స్టేషన్ తదితర అవసరాల కోసం స్థలం కేటాయించాలని కోరినట్లు తెలిపారు. దీనిపై అప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత జీవో జారీ చేసిందని, అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోను పక్కన పెట్టారని పేర్కొన్నారు.

ఏది ఏమైనా ప్రభాత్ నగర్ పార్కు స్థలాన్ని వాకర్స్‌కు అందుబాటులో ఉండేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పార్కు వద్ద గేటు ఏర్పాటు చేయకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేకు వాకర్స్ కృతజ్ఞతలు

ఎమ్మెల్యే ఇచ్చిన హామీపై వాకర్స్ హర్షం వ్యక్తం చేస్తూ సంతోషం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, త్రివేది, పవన్, జయశ్రీ, గట్టు శీను, రమణారెడ్డి, కాలనీ అధ్యక్షుడు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.