BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 04:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోటపాడు–పోతునూరుకు వంతెన ఎప్పుడు..?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Nov, 2026 - 04:48 PM
66 వీక్షణలు

80 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలోనూ తీరని వంతెన సమస్య.. పాలకులు మారినా మారని ప్రజల తలరాత! వరద ఉధృతికి కొట్టుకుపోయిన రహదారి.. గోతుల్లో దిగబడిన లారీ.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం కోటపాడు–పోతునూరు గ్రామాల మధ్య వంతెన సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. వరద ఉధృతికి ఈ రెండు గ్రామాలను కలిపే సప్టా వద్ద రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజలు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. వరద నీటి ప్రవాహానికి మట్టి రహదారి కొట్టుకుపోయి పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. తాజాగా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ లారీ గోతుల్లో దిగబడిపోవడంతో రాకపోకలకు మరింత అంతరాయం ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొనడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వస్తే ఇదే తిప్పలు కోటపాడు–పోతునూరు గ్రామాల మధ్య శాశ్వత వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో వరదలు వచ్చిన ప్రతిసారీ ఇదే సమస్య ఎదురవుతోంది. వరద ప్రవాహం పెరిగితే సప్టా వద్ద రహదారి దెబ్బతినడం, బురదలో వాహనాలు దిగబడిపోవడం, రాకపోకలు నిలిచిపోవడం పరిపాటిగా మారింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు, రైతులు, నిత్యం ఈ మార్గంపై ఆధారపడే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్లాల్సి వచ్చినా ఈ మార్గం గుండా ప్రయాణించడం కష్టసాధ్యంగా మారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది దశాబ్దాలైనా పరిష్కారం ఏదీ? స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా కోటపాడు–పోతునూరు గ్రామాల మధ్య వంతెన సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అంటూ పాలకులు ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ, రెండు గ్రామాలను అనుసంధానించే కనీస రవాణా సదుపాయం కూడా అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమని విమర్శిస్తున్నారు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి రావడం తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించాలి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి క్షేత్రస్థాయిలో పర్యటించి రహదారి దుస్థితిని పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కోటపాడు–పోతునూరు గ్రామాల మధ్య శాశ్వత వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోసారి వరదలు వచ్చేవరకు వేచి చూడకుండా ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రశ్న ఒక్కటే.. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచినా కోటపాడు–పోతునూరు గ్రామాలకు శాశ్వత వంతెన ఎందుకు అందడం లేదు? ఈ సమస్యకు పరిష్కారం చూపే పాలకులు ఎప్పుడు వస్తారు?