ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
ప్రేమ వ్యవహారంలో మనస్తాపంతో గడ్డి మందు తాగిన 18 ఏళ్ల యువతి
జనగామ జిల్లా, కొడకండ్ల (ఎన్ టుడే న్యూస్): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానస (18), కొడకండ్లకు చెందిన ఓ యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని మానస కోరగా, యువకుడు నిరాకరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం గడ్డి మందు తాగింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడితో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.