BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 03:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శాంతియుత వాతావరణంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Nov, 2026 - 03:40 PM
36 వీక్షణలు

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామీణ ఓటర్లు వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి సుంకొల్లు పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకుల గలాటాపై మంత్రి ఆగ్రహం ఏలూరు/నూజివీడు, నవంబర్ 05: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. గ్రామీణ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు తావులేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం నూజివీడు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. అన్నవరం, వెంకటాయపాలెం, సుంకొల్లు, రేగుంట, బోర్యంచ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లతో మాట్లాడి వారికి కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. సుంకొల్లు ఘటనపై మంత్రి ఆగ్రహం సుంకొల్లు పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు గలాటా చేయడంతో మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, ప్రజల మద్దతుతో గెలుపొందవచ్చని, అయితే పోలింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పోలింగ్‌కు ఆటంకాలు సృష్టించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతి ఓటరుకు భద్రత, సౌకర్యాలు కల్పించాలి ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని, గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, నిండు గర్భిణులు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఓటు వేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పునాదులైన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా, ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన భద్రత కల్పించాలని, అక్రమాలకు తావులేకుండా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.