
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
జిల్లా అధికారులకు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 35 అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 22, సివిల్ సప్లై శాఖకు 6, గ్రామీణ అభివృద్ధి శాఖకు 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగానికి 2 దరఖాస్తులు వచ్చాయి. అలాగే సర్వే ల్యాండ్స్, వ్యవసాయ, మున్సిపాలిటీ శాఖలకు ఒక్కో దరఖాస్తు చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు.
వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, జడ్పీ సీఈవో శోభారాణి, ఆర్డీవో కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా మరియు మండల అధికారులు పాల్గొన్నారు.
#Prajavani
#PublicGrievances
#DistrictCollector
#YadadriBhuvanagiri
#Governance
#PublicAdministration
#TelanganaNews
#NtodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube