BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 16 April 2026, 03:17 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
16 Apr, 2026 - 03:17 PM
296 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా,​రాజాపేట మండలం, చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి స్వాగతించారు. వివాదాస్పదంగా మారిన సదరు క్రషర్ వద్దే ఈ బహిరంగ చర్చ నిర్వహిద్దామని, ఎమ్మెల్యే బిజీ షెడ్యూల్ దృష్ట్యా మీరు తేదీని ఖరారు చేస్తే తాము రావడానికి సిద్ధమని ప్రకటించారు.జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టుల సాక్షిగా ఈ చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ​చల్లూరులో రాత్రింబగళ్లు అక్రమంగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్నా  ఎందుకు మౌనంగా ఉన్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా పేరుతో కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.కేవలం మాటలకే పరిమితం కాకుండా, తక్షణమే సదరు క్రషర్ కార్యకలాపాలను నిలిపివేయించి విచారణ జరిపించడం ద్వారా ఎమ్మెల్యే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు