BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:33 pm
Posted by : V శ్రీనివాస్

​మెరుగైన వైద్య సేవలు అందించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:33 PM
301 వీక్షణలు

​మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. బెల్లంపల్లి మండల కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు, వైద్య సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

​అనంతరం విద్య, రెవెన్యూ రంగాల పురోగతిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించి, నాణ్యమైన సదుపాయాలతో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కృష్ణతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్, ఈ నెల 24వ తేదీ లోగా ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. అలాగే సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి భూభారతి, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించారు.

​చివరగా కాసిపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న అదనపు గదులు, భోజనశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల వంటశాలను తనిఖీ చేసి, విద్యార్థినులకు అందించే మధ్యాహ్న భోజన నిత్యావసరాల నాణ్యతను పరిశీలించిన ఆయన, ఆహార తయారీలో శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్, తహసిల్దార్ కృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆసుపత్రి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు