BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:33 pm
Posted by : V శ్రీనివాస్

​భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:33 PM
303 వీక్షణలు

​భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు

మంచిర్యాల, జూలై 15: ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను ఆయన స్థానిక తహసిల్దార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్దికల్ గ్రామంలోని 853 సర్వే నంబర్లలో గల 4,810 ఎకరాల భూమిని ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో నలుగురు సర్వేయర్ల ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సహకారంతో నిబంధనల ప్రకారం సర్వే పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తవని, స్పష్టమైన వివరాలతో నూతన నక్షా రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు.

​అనంతరం ఆరెపల్లి గ్రామం, భీమారం మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించిన అదనపు కలెక్టర్, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్‌ను పరిశీలించి, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి అందించాల్సిన సి.ఎం.ఆర్. (CMR) బియ్యాన్ని గడువులోగా సరఫరా చేయాలని రైస్ మిల్లు నిర్వాహకులకు సూచించారు. ఈ పర్యటనలో తహసిల్దార్‌తో పాటు పలువురు రెవెన్యూ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు