BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:30 pm
Posted by : V శ్రీనివాస్

​కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:30 PM
325 వీక్షణలు

​కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల వినతి

మంచిర్యాల: గత 25 ఏళ్లుగా పెరగని కోల్ మైన్స్ పెన్షన్‌ను కరువు భత్యంతో కూడిన 50 శాతానికి పెంచే విధంగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. సింగరేణి పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని MNR గార్డెన్‌లో జరిగిన సమావేశంలో మంత్రికి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. రూ.300 నుండి రూ.1000 లోపు అతి తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి కనీస పెన్షన్‌ను నెలకు రూ.15 వేలుగా నిర్ణయించాలని, CPRMS మెడికల్ కార్డ్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

​దీంతో పాటు 2016 నాటి రూ.20 లక్షల గ్రాడ్యుటీని చెల్లించాలని, సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ, మారు పేర్ల సవరణ, 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటును చేపట్టాలని కోరారు. ముఖ్యంగా తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేటాయించిన మాదిరిగానే, సర్వే పూర్తయిన శ్రవణ్‌పల్లి, RK 6 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గజెల్లి వెంకటయ్య, రాళ్లబండి రాజన్న, పుదారి నర్సయ్య, ఏ. గంగయ్య, ఎం. అంజయ్య తదితరులు పాల్గొన్నారు