BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:31 pm
Posted by : కూనురు మధు

నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
15 Jul, 2026 - 10:31 PM
112 వీక్షణలు

నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ

శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ బుధవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతితో పాటు పోలీసుల పనితీరును ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ  ​తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను ఎస్పీ పరిశీలించారు. పెండింగ్ కేసుల స్థితి, స్టేషన్ ఆవరణ నిర్వహణ, రాత్రి వేళల్లో భద్రతా నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు మరియు సిబ్బంది హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పెండింగ్ కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిరేకల్

​పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు గాను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నేరస్థులపై నిఘా: రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, బెయిల్‌పై విడుదలైన నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి అని,  రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తరచూ తనిఖీలు నిర్వహించాలి అని తెలిపారు. ప్రజలను నిరంతరం వేధిస్తున్న సైబర్ నేరాల పట్ల విస్తృత అవగాహన కల్పించాలిఅని . ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలి అని ఆదేశించారు. ​ప్రజల విశ్వాసం పెంపొందేలా పని చేయాలని పేర్కొన్నారు  స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సున్నితంగా స్వీకరించి చట్టపరమైన చర్యలు త్వరగా చేపట్టాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా ప్రతి పోలీసు అధికారి నిబద్ధతతో పనిచేయాలి అని. పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే ప్రతి అధికారి, సిబ్బంది క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి.అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి ,  నకిరేకల్ సీఐ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..