BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 April 2026, 08:29 pm
Posted by : NTODAY NEWS

అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
16 Apr, 2026 - 08:29 PM
153 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల డ్రైవ్ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభమైంది. ఇందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, పోలిరెడ్డి పాలెం పరిధిలో అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఉచిత యూనిఫామ్‌లు, అలాగే ఉచిత పాఠ్యపుస్తకాలు, షూ, బెల్ట్, సాక్స్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు డిజిటల్ విధానంలో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందిస్తున్నామని వివరించారు.

వైఎస్ఆర్ కాలనీ, మదర్ తెరెసా కాలనీ, లక్ష్మీనరసింహ కాలనీ, పోలిరెడ్డిపాలెం, కొండ్రుపాడు ప్రాంతాల విద్యార్థులు సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేరి ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఫౌండేషన్ లిటరసీ స్కిల్స్ (FLS) పరీక్షను పరిశీలించారు. కార్యక్రమంలో విద్యార్థులు “ప్రభుత్వ బడి – చదువుల గుడి”, “ఇంటింటా చదువు – ఊరంతా వెలుగు”, “పెద్దలు పనికి – పిల్లలు బడికి”, “బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించండి” వంటి నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జై హైమావతి, ఉపాధ్యాయులు పి. శైలజ, పోటు శ్రీనివాసరావు, జి. ఆదిలక్ష్మి, కె. అరుణ, సిహెచ్. నవ్యశ్రీ, సీఆర్పీ శివ పార్వతి మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.