BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 16 April 2026, 07:46 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Apr, 2026 - 07:46 PM
157 వీక్షణలు

​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి

మంచిర్యాల జిల్లాలో కీటక జనిత మరియు సంక్రమణ వ్యాధుల నివారణే లక్ష్యంగా ఏప్రిల్ 16 నుండి మే 15 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ప్రకటించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో మేయర్ ధరణి మధుకర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పోస్టర్లను విడుదల చేసిన ఆయన, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు గ్రామాల్లో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టడానికి మున్సిపల్, పంచాయతీ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో దోమల మందు పిచికారీ, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా 'డ్రై డే' పాటించడం వంటి జాగ్రత్తలతో పాటు, పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు తగినంత నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలన్నింటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు