www.ntodaynews.com
రైతుకు యూరియా కష్టం!!
తెలంగాణ
రైతుకు యూరియా కష్టం!!
NTODAY NEWS:నర్సాపూర్
• యూరియా దొరకక రైతన్న ఆవేదన
• చెప్పులు పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి అవస్థలు
• గంటల తరబడి లైన్లో ఉన్న దొరకని యూరియా బస్తాలు
•ప్రభుత్వంఫై మండి పడుతున్న రైతులు
రాష్టంలొ రైతన్నకు శాపంగా మారింది యూరియా కొరత. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి లైన్లో ఉండి క్యూ లైన్ లో చెప్పులు పాస్ పుస్తకాలు పెట్టి ఎదురు చుసిన యూరియా దొరకడం లేదాని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడడంతో బోరు బావుల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండాల్సిన తాము పొద్దున లేచి రైతు వేదికల చుట్టూ ఫర్టిలైజర్ షాప్ ల చుట్టూ తిరిగి క్యూలైన్లో నిలిచి ఉంటే ఒకే ఒక్క యూరియా బస్త ఇవ్వడం ఏంటని ప్రభుత్వంపై ఆగ్రహంతో మండిపడుతున్నారు రైతులు. మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండల కేంద్రంలోని శీలంపల్లి రైతువేదికకు యూరియా బస్తాల లారీ రావడం తో శుక్రవారం శీలంపల్లి రైతువేదిక వద్దకు మండలంలొని రైతులు భారీగా చేరుకున్నారు. క్యూలైన్ లొ చెప్పులు పట్టా పాస్ పుస్తకాలని పెట్టి ఎదురు చూసారు. ఎంత సేపటికి అధికారులు బస్తలను అందించక పోవడంతో రైతు వేదికలోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా అధికారులు యూరియా కొరత లేదని చెపుతున్న మరి ఇక్కడ యూరియా కొరత ఎందుకు వచ్చిందని పోలీస్ లు మరియు వ్యవసాయ అధికారులతో వగ్వాదానికి దిగారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube