BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

ప్రతి పాఠశాలను సందర్శించి నివేదిక ఇవ్వాలి

తెలంగాణ
19 Jan, 2026 - 08:51 AM
157 వీక్షణలు
ప్రతి పాఠశాలను సందర్శించి నివేదిక ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: కరీంనగర్ ప్రత్యేక అధికారులు జిల్లాలోని ప్రతి పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి, అక్కడి మౌలిక వసతులు సహా పలు అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెలాఖరులోపు జిల్లాలోని అన్ని పాఠశాలలను ప్రత్యేక అధికారులు సందర్శించాలని సూచించారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల వినియోగం, విటమిన్ గార్డెన్ నిర్వహణ, ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు, మధ్యాహ్న భోజనం నాణ్యత, టాయిలెట్లు, తాగునీరు వంటి మౌలిక వసతులపై ప్రత్యేకంగా పరిశీలన చేయాలని తెలిపారు. అవసరమైన అంశాలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వర్షపు నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు ఎక్కడెక్కడ చేపట్టారో, వాటికి సంబంధించిన ఫోటోలను జీపీఎస్ సహాయంతో నిర్దిష్ట వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిలబస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. విటమిన్ గార్డెన్లు, సాయంత్రం తరగతుల నిర్వహణను కూడా ప్రత్యేక అధికారులు పరిశీలించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐదు క్లబ్బుల పనితీరును సమీక్షించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు. ప్రజావాణికి 250 దరఖాస్తులు ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌లతో కలిసి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. మొత్తం 250 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. #DistrictCollector #PamelaSatpathy #SchoolInspection #EducationReview #PublicHearing #PrajaVani #SchoolInfrastructure #MidDayMeal #StudentWelfare #GovernmentSchools #EducationDepartment #DistrictAdministration Follow us on Website Facebook Instagram YouTube