BREAKING
thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా
Test 4
Date of Publish : 16 November 2026, 05:28 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మహిళలకు ఆర్టీసీ నెలవారీ బస్ పాస్‌లపై 50 శాతం రాయితీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:28 PM
8 వీక్షణలు

డీలక్స్, లగ్జరీ, రాజధాని బస్సుల్లోనూ ప్రత్యేక వెసులుబాటు.. ఆదివారాల్లో సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

హైదరాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): నెలవారీ రూట్ పాస్‌లు తీసుకునే మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీ కల్పించింది. మెట్రో, డీలక్స్, లగ్జరీ, రాజధాని బస్సుల్లో 30 రోజుల పాస్‌ కోసం 15 రోజుల చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ రాయితీ గత శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

ప్రయాణికులపై పాస్‌ల భారం తగ్గించేందుకు టోల్ ప్లాజా చార్జీల లెక్కింపులోనూ మార్పులు చేశారు. గతంలో 25 రోజుల చార్జీలను పరిగణనలోకి తీసుకోగా, ఇకపై 20 రోజుల చార్జీలనే లెక్కించనున్నారు. దీంతో నెలవారీ పాస్‌ల ధరలు తగ్గనున్నాయి.

సాధారణ ప్రయాణికుల కోసం డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ పాస్‌లు ఈ-డీలక్స్ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతాయి.

ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ నగరాల్లో నెలవారీ సిటీ పాస్‌లు కలిగిన ప్రయాణికులకు ఆదివారాల్లో అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అయితే ఈ వెసులుబాటు పుష్పక్ ఎయిర్‌పోర్ట్ సర్వీసులకు వర్తించదు. ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లోనూ ఈ సౌకర్యం వర్తించదని పేర్కొన్నారు.