జాతీయ ఐక్యత సందేశంతో 5K, 10K వాక్/రన్
అక్టోబర్ 31న ఉదయం 6 గంటలకు ప్రారంభం: వరంగల్ సీపీ ఎన్. శ్వేత
వరంగల్, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్): సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఏక్తా దివస్–జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 31న 5K, 10K వాక్/రన్ నిర్వహించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.
పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభం
శనివారం ఉదయం 6 గంటలకు హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వాక్/రన్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మట్టేవాడ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, తిరిగి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకోవడంతో కార్యక్రమం ముగుస్తుంది.
పురుషులు, మహిళలు, సీనియర్ సిటిజన్లకు అవకాశం
ఈ వాక్/రన్‌లో పురుషులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొనవచ్చని సీపీ ఎన్. శ్వేత తెలిపారు. జాతీయ ఐక్యత, ఐకమత్యం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పోటీల్లో విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.