అగ్రి స్టాక్ అమలుకు జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు
తెలంగాణ
/
హన్మకొండ
-జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా కమిటీ ఏర్పాటు
వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన హనుమకొండ జిల్లా కలెక్టర్
హనుమకొండ, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్): అగ్రి స్టాక్ టెక్నాలజీ విధానం అమలుకు జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటుపై హనుమకొండ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
అగ్రి స్టాక్ టెక్నాలజీ విధానం అమలును సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖల అధికారులను సభ్యులుగా నియమించారు.
ఈ కమిటీ ద్వారా అగ్రి స్టాక్ విధానం అమలుకు అవసరమైన చర్యలను వివిధ శాఖల సమన్వయంతో చేపట్టనున్నారు.