స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలి
అచ్యుతాపురం, సెప్టెంబర్ 21: పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కరణం వెంకట్ సోమవారం ఈ వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కరణం వెంకట్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 75 శాతం స్థానిక ఉద్యోగాల నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో, స్థానిక యువతకు ప్రాధాన్యం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.