లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
8 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం
లింగాల, | ఎన్ టుడే న్యూస్:
లింగాల మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుహాసిని మంగళవారం తెలిపారు. వీటిలో 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు.
టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు:
- లింగాల: ఓటా నీలమహేశ్వరి
- కామసముద్రం: దేవిరెడ్డి సంజీవరెడ్డి
- ఇప్పట్ల: పందిళ్లపల్లి మనోహర్ రెడ్డి
- చిన్నకుడాల: లోమడ స్నేహ
- బోనాల: కొమ్మ జయరామిరెడ్డి
- వెలిదండ్ల: గొడ్డుమర్రి అనిల్ కుమార్
- పార్నపల్లె: ముక్కోళ్ల రమేష్
- కోమనూతల: నాగిరెడ్డి ప్రసన్న
బీజేపీ తరఫున మురారిచింతల ఎంపీటీసీ స్థానానికి బుడమకుంట్ల సువర్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సుహాసిని తెలిపారు.