పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
బీటెక్ రవి నాయకత్వంలో విజయం సాధించిన అభ్యర్థులకు డిక్లరేషన్లు
పులివెందుల | ఎన్ టుడే న్యూస్:
పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి నాయకత్వంలో మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యులు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్లు స్వీకరించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఈ.కొత్తపల్లె నుంచి మాడెం పుష్పనాథ రెడ్డి, యర్రబల్లె-2 నుంచి కడపన శ్యామల దేవి, రాగిమనుపల్లె నుంచి బండి సునీత, యర్రబల్లె-1 నుంచి రాజశేఖర్ పండితి, అచ్చవెళ్లి నుంచి షరీఫ్ మహమ్మద్ ఉన్నారు.
బీటెక్ రవి నాయకత్వంలో ఈ ఏకగ్రీవ విజయాలు సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.