BREAKING
thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● లింగాల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం thumb ● లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు thumb ● వల్లూరు మండల జడ్పీటీసీగా పుత్తా హరిత రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన
మంచి మాట
Date of Publish : 28 October 2026, 06:50 am
Posted by : SHAIK CHAND BASHA

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Oct, 2026 - 06:50 AM
9 వీక్షణలు

స్కానింగ్ సెంటర్లపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి

- అక్రమ పరీక్షలను గుర్తించేందుకు డెకాయ్ ఆపరేషన్లు

- లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు

కడప | ఎన్ టుడే న్యూస్‌:

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పీసీపీఎన్‌డీటీ నోడల్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతర పర్యవేక్షణతో పాటు అక్రమ పరీక్షలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కడప డివిజన్ సబ్ డిస్ట్రిక్ట్ లెవల్ అడ్వైజరీ కమిటీ (SDLAC) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలను గుర్తించాలని సూచించారు. సంబంధిత శాఖల సమన్వయంతో లింగ వివక్ష నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం కల్పించాలని తెలిపారు.

స్కానింగ్ సెంటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలను గుర్తించేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు గుర్తిస్తే, సంబంధిత కేంద్రాలపై పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనంతరం ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ గర్భస్రావాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో డాక్టర్ రబ్బానీ, డాక్టర్ బాలకృష్ణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శ్రీపతి, ఉషారాణి, ఐసీడీఎస్ ప్రతినిధి సుగుణ, డిప్యూటీ డెమో ప్రసన్నలత, డిప్యూటీ హెచ్‌ఈవో కుమారి తదితరులు పాల్గొన్నారు.