BREAKING
thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి
Test 4
Date of Publish : 16 November 2026, 05:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

GWMC ప్రజావాణికి 92 ఫిర్యాదులు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:51 PM
10 వీక్షణలు

నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలి: కమిషనర్ టి. వెంకన్న

వరంగల్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ టి. వెంకన్న ప్రజల నుంచి 92 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన వినతులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 44 ఫిర్యాదులు అందగా, ఇంజినీరింగ్ విభాగానికి 28 ఫిర్యాదులు వచ్చాయి. మిగిలిన ఫిర్యాదులు ఇతర విభాగాలకు సంబంధించినవిగా ఉన్నాయి. ప్రజల సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

అలాగే ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల రూపంలో వసూలు చేసిన మొత్తాలను 24 గంటల్లో ఖజానాలో జమ చేయాలని సూచించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత పాటించాలని, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.