రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామన్నపేట మండల విద్యాశాఖాధికారి తంగెళ్ల సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
రామన్నపేట మండల విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న సురేందర్ రెడ్డి విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ విద్యా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఆయన నాయకత్వంలో రామన్నపేట మండలంలో విద్యా రంగానికి సంబంధించిన కార్యక్రమాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.
జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల రామన్నపేట మండలానికి చెందిన గెజిటెడ్ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం సమస్యలు, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శిగా కె. రవీందర్, ట్రెజరర్‌గా పల్వాయి వెంకటయ్య, రాష్ట్ర కౌన్సిలర్‌గా వేణుగోపాల్ ఎన్నికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్మల, కనక రాజు, మాజీ అధ్యక్షుడు మాగీ సురేష్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని గెజిటెడ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సురేందర్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగం మరింత అభివృద్ధి సాధించాలని, సంఘం తరఫున ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి జరగాలని రామన్నపేట మండల ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.