BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:31 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:31 PM
21 వీక్షణలు
  • 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారికి అవకాశం.. ఒక్కో కుటుంబం నుంచి ఒకరికే అర్హత
  • అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

తెలంగాణ, నవంబర్ 21:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి అర్హతలు, నమోదు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే జీవిత బీమా సదుపాయం కల్పించనున్నారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీలకు రూ.5 లక్షల బీమా మొత్తం అందుతుంది.

పథకానికి సంబంధించిన ముఖ్యమైన మార్గదర్శకాలు:

  • ప్రతి కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు అర్హులు.

  • దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు అర్హులు.

  • వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు.

  • ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదై ఉంటే, సంబంధిత సంవత్సరం జూలై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు.

  • బీమా కవరేజీ ప్రారంభమైన తేదీ నుంచి సంబంధిత పాలసీ సంవత్సరం ముగిసే వరకు బీమా రక్షణ వర్తిస్తుంది.

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన కుటుంబాలు తమ వివరాలను పరిశీలించుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కుటుంబంలో బీమా పొందేందుకు అర్హులైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సమయంలో వయస్సు, ఆధార్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.