BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 10:18 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ను కలిసిన పోలవరం సర్పంచ్ అభ్యర్థి ఆలూరి మాధవ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
21 Nov, 2026 - 10:18 PM
17 వీక్షణలు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని వెల్లడి

కనిగిరి:

కనిగిరి మండలం పోలవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఆలూరి మాధవ కనిగిరిలోని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఆలూరి మాధవ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్‌ఛార్జికి హామీ ఇచ్చారు.

పార్టీ శ్రేణుల సహకారంతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మడతల కస్తూరి రెడ్డి, మునగల బ్రహ్మారెడ్డి, చిలకల మాలకొండ రెడ్డి, కొండారెడ్డి, వెంకటస్వామి రెడ్డి, మునగా బాలసుబ్బారెడ్డి, చార్లెస్ తదితరులతో పాటు పోలవరం పంచాయతీ నాయకులు పాల్గొన్నారు.