BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 08:06 pm
Posted by : K MAHESH

కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

తెలంగాణ
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 08:06 PM
20 వీక్షణలు
  • రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు
  • అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా: సీఐ సత్యనారాయణ

కేసముద్రం, నవంబర్ 21:

శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణ లక్ష్యంగా కేసముద్రం పోలీస్ సర్కిల్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు క్రాంతి కిరణ్, కరుణాకర్, నరేష్‌తో పాటు మూడు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

కేసముద్రం పట్టణంలోని రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో వ్యక్తులు, వాహనాల రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఆపి వారి వివరాలను ఆరా తీశారు. వాహనదారుల పత్రాలను తనిఖీ చేశారు.

నిషేధిత వస్తువుల అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.