BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:33 pm
Posted by : K MAHESH

బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:33 PM
21 వీక్షణలు
  • 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహం చేయాలి: జెండర్ స్పెషలిస్ట్ భార్గవి
  • అక్రమ దత్తత, బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 21:

బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని జెండర్ స్పెషలిస్ట్ భార్గవి సూచించారు. రామన్నపేట అంగన్వాడి కేంద్రంలో బాల్య వివాహాలు, అక్రమ దత్తత, వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణలో తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

బాలికలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయాలని స్పష్టం చేశారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు, గర్భధారణ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. చిన్న వయస్సులో తల్లులయ్యే బాలికలకు పుట్టే పిల్లల్లో కూడా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు.

బాలికలకు యుక్తవయస్సు రాగానే వివాహాలు చేసి బాధ్యత తీరిపోయిందని భావించే తల్లిదండ్రులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు భవిష్యత్తులో స్వతంత్రంగా జీవించే అవకాశాలు కల్పించాలని తెలిపారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రతి కుటుంబం గుర్తించి, వాటి నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో లలిత, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలలు తదితరులు పాల్గొన్నారు.