BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:52 pm
Posted by : K MAHESH

పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
21 Nov, 2026 - 07:52 PM
20 వీక్షణలు
  • తొలిముద్ద అల్పాహార పథకంతో చిన్నారులకు పోషకాహారం: సర్పంచ్ గుండెబోయిన ఉషా అశోక్ యాదవ్
  • ఎర్రబెల్లిగూడెం అంగన్వాడీ కేంద్రాల్లో పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్, ఉప సర్పంచ్

నెల్లికుదురు, నవంబర్ 21:

పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడటమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని ఎర్రబెల్లిగూడెం గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉషా అశోక్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ‘తొలిముద్ద అల్పాహార పథకం’ను శనివారం నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉప సర్పంచ్ జీలుకర సాంబమూర్తి, మేచరాజుపల్లి క్లస్టర్ అంగన్వాడీ సూపర్‌వైజర్ జలగం సునీతతో కలిసి ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు పౌష్టికాహార లోపం కారణంగా శారీరక, మానసిక సమస్యలకు గురికాకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. చిన్నారులకు పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా కిశోర బాలబాలికల్లో శారీరక పుష్టి, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని అన్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

గర్భిణులు, బాలింతలు, కిశోర బాలబాలికలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రయ్య, వార్డు సభ్యుడు గజ్జి అశోక్ యాదవ్, మాజీ వార్డు సభ్యురాలు పనికర నరసమ్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు జీలుకర సుభోదర, మోతుకూరి అలివేలు, గాదె జ్యోతి, శ్రీరాముల స్వరూప, ఆయా కందగట్ల స్వరూప, ఆశా వర్కర్లు కడియం భాగ్యలక్ష్మి, పెరుమాండ్ల మంజుల, ఉపాధ్యాయ బృందం, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.