BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 10:05 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పెదరాజుపాలెం పంచాయతీలో సర్పంచ్‌తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
21 Nov, 2026 - 10:05 PM
15 వీక్షణలు

ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అభినందనలు

కనిగిరి, నవంబర్ 21:

సీఎస్ పురం మండలంలోని పెదరాజుపాలెం గ్రామ పంచాయతీలో ప్రజల మద్దతుతో సర్పంచ్‌తో పాటు ఏడు వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చల్లగాలి మరియమ్మతో పాటు 2, 3, 4, 6, 7, 8, 9 వార్డులకు చెందిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా శనివారం కనిగిరిలోని స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అభినందించారు. సర్పంచ్ చల్లగాలి మరియమ్మతో పాటు వార్డు సభ్యులు బొగ్గవరపు చిన్న కొండమ్మ (2వ వార్డు), జొన్నకోతల నరేష్ (3వ వార్డు), ధనెంకుల నాగేశ్వరరావు (4వ వార్డు), దర్శి రామదేవి (6వ వార్డు), మీసాల పెద వెంకటస్వామి (7వ వార్డు), పట్టేబోయిన రత్నమ్మ (8వ వార్డు), ధనెంకుల నాగార్జున (9వ వార్డు)లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ పెదరాజుపాలెం పంచాయతీలో సర్పంచ్‌తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక కావడం గ్రామ ప్రజల్లోని ఐక్యతకు, అభివృద్ధిపై ఉన్న ఆకాంక్షకు నిదర్శనమని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌కు, మండల పార్టీ శ్రేణులకు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తమకు మద్దతు తెలిపిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నాగం వెంకటస్వామి, మాజీ ఉపసర్పంచ్ ధనెంకుల నాగార్జున, అట్లూరి వెంకటస్వామి, రామిశెట్టి బాబు, కందెర నాగ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.