BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 09:48 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరు మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
21 Nov, 2026 - 09:48 PM
14 వీక్షణలు
  • ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు: జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు
  • స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కందుకూరు, నవంబర్ 21:

కందుకూరు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి. రాజబాబుతో కలిసి శనివారం కందుకూరు పట్టణంలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న పాలిటెక్నిక్ కళాశాలను, పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన టీ.ఆర్.ఆర్. జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ కందుకూరు మున్సిపాలిటీలోని 40 వార్డులకు మొత్తం 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధులు, బాలింతల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అవసరమైన పోలీసు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఓటర్లందరూ ఎలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ డి. హిమవంశీ, కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ అనూష, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాసరావు, కందుకూరు సీఐ జగదీష్, తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.