BREAKING
thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం
Date of Publish : 04 October 2026, 09:56 am
Posted by : MOOLA RAJENDRA REDDY

మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
04 Oct, 2026 - 09:56 AM
12 వీక్షణలు
ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ఆరేపల్లి ఉమేష్ చంద్ర అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) నుంచి మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా పొందారు.

ఉమేష్ చంద్ర అంబేద్కర్ విద్యార్థి నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌కు 2024–25 విద్యా సంవత్సరంలో అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పలు కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించారు.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించి నిర్వహించిన భూ ఆందోళనలోనూ ఆయన నాయకత్వం వహించారు. విద్యార్థి దశలో వివిధ అంశాలపై చురుకుగా పనిచేస్తూనే ఉన్నత విద్యను కొనసాగించిన ఆయన మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

ఆత్మకూరు నుంచి ఉన్నత విద్యలో డాక్టరేట్ సాధించిన ఉమేష్ చంద్ర అంబేద్కర్‌ను స్థానికులు, విద్యార్థులు అభినందించారు.