BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 11:03 pm
Posted by : A. MURALIDHAR

చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
17 Nov, 2026 - 11:03 PM
22 వీక్షణలు

5 క్లస్టర్లుగా 19 గ్రామ పంచాయతీల విభజన.. కేంద్రాల వివరాలు వెల్లడించిన ఎంపీడీవో లీలా మాధవి

అన్నమయ్య జిల్లా | చౌడేపల్లె | (ఎన్ టుడే న్యూస్)

చౌడేపల్లె మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల పరిధిలోని మొత్తం 19 గ్రామ పంచాయతీలను ఐదు క్లస్టర్లుగా విభజించి, ఆయా క్లస్టర్ల పరిధిలోని అభ్యర్థుల కోసం నామినేషన్ కేంద్రాలను ఖరారు చేసినట్లు ఎంపీడీవో లీలా మాధవి వెల్లడించారు. మొత్తం 42,103 జనాభా కలిగిన మండలంలో అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియ సులభంగా ఉండేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

క్లస్టర్ల వారీగా నామినేషన్ కేంద్రాలు, వాటి పరిధిలోని గ్రామ పంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు.

చౌడేపల్లె క్లస్టర్: స్వర్ణ గ్రామం-2లో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ పరిధిలో చౌడేపల్లె (7,026), వెంగళపల్లె (1,887) గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ రెండు పంచాయతీల మొత్తం జనాభా 8,913.

దిగువపల్లి క్లస్టర్: స్వర్ణ గ్రామం, దిగువపల్లిలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ క్లస్టర్ పరిధిలో దిగువపల్లి (3,470), కాగతి (2,988), కటిపేరి (2,133), కొండమర్రి (1,908) గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి మొత్తం జనాభా 10,499.

గడ్డంవారిపల్లె క్లస్టర్: స్వర్ణ గ్రామం, గడ్డంవారిపల్లెలో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ పరిధిలో గడ్డంవారిపల్లె (1,986), పరికిడోన (1,893), అమినిగుంట (1,339) గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం జనాభా 5,218.

పుదిపట్ల క్లస్టర్: స్వర్ణ గ్రామం, పుదిపట్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ పరిధిలో పుదిపట్ల (1,345), కొండయ్యగారిపల్లి (1,362), లద్దిగం (1,251), 29.ఎ. చింతామాకులపల్లి (1,807), పెద్దయల్లకుంట్ల (1,054) గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఐదు పంచాయతీల మొత్తం జనాభా 6,819.

శెట్టిపేట క్లస్టర్: శెట్టిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ క్లస్టర్ పరిధిలో చారాల (2,437), దుర్గసముద్రం (2,991), ఎ.కొత్తకోట (2,250), శెట్టిపేట (1,134), పందిళ్ళపల్లి (1,842) గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి మొత్తం జనాభా 10,654.

ఈ సందర్భంగా ఎంపీడీవో లీలా మాధవి మాట్లాడుతూ, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమకు కేటాయించిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాల్లోనే నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వివరాలను ముందుగానే తెలుసుకుని, ప్రక్రియకు అవసరమైన పత్రాలు, ఏర్పాట్లతో నిర్ణీత కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు అభ్యర్థులు అధికారులకు సహకరించాలని ఎంపీడీవో కోరారు.