BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 18 November 2026, 05:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు బైపాస్‌పై అడ్డదిడ్డంగా పార్కింగ్.. నిత్యం ట్రాఫిక్ కష్టాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 05:27 AM
18 వీక్షణలు

ఆల్ఫా కైపు టీ స్టాల్ వద్ద వాహనాల నిలుపుదలకు అడ్డూ అదుపు కరవు పార్కింగ్ స్థలం లేకుండా రోడ్డుపై వాహనాలు ఎలా నిలుపుతారు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు బైపాస్ రోడ్డులోని ఆల్ఫా కైపు టీ స్టాల్ సమీపంలో అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌తో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. టీ స్టాల్‌కు వచ్చే కొందరు వాహనదారులు కార్లు, ద్విచక్ర వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తుండటంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ మార్గం మీదుగా భద్రాచలం వైపు వెళ్లే వాహనాలతో పాటు తిరువూరు పట్టణంలోకి వచ్చే వాహనాలు, విజయవాడ ప్రధాన రహదారిపైకి వెళ్లే వాహనాలు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రోడ్డుపైనే వాహనాలను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంటోంది. పాదచారులు సైతం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడలి సమీపంలో పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం లేకుండానే వాహనాలను రోడ్డుపై ఎలా నిలుపుతున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ పరిస్థితిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్, పోలీసు అధికారులు స్పందించి ఆల్ఫా కైపు టీ స్టాల్ వద్ద రోడ్డుపై వాహనాల పార్కింగ్‌ను అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.