BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:30 pm
Posted by : K MAHESH

తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 08:30 PM
27 వీక్షణలు

పిల్లల ఆరోగ్యానికి కూరగాయలతో కిచిడీ ఎంతో మేలు: కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి

వరంగల్ జిల్లా | నర్సంపేట | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

తక్కువ ఖర్చుతోనే అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసుకోవడంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు నర్సంపేట-4 అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నర్సంపేట ప్రాజెక్టు సీడీపీఓ మధురిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోషకాహార తయారీపై అవగాహనతో పాటు వంటల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్, ఏఎల్ఎంఎస్‌సీ చైర్మన్ శ్రీరామోజు రోజారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ జ్యోతి మాట్లాడుతూ.. వివిధ రకాల కూరగాయలతో తక్కువ సమయంలో కిచిడీ తయారు చేసుకోవచ్చని, దీని ద్వారా సమయం ఆదా కావడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయని వివరించారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి ఇలాంటి పోషకాహారం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం స్వయంగా కిచిడీ తయారు చేసి చూపించడంతో పాటు కార్యక్రమానికి హాజరైన మహిళలకు భోజనం ఏర్పాటు చేశారు.

శ్రీరామోజు రోజారాణి మాట్లాడుతూ.. గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని, వీటి ద్వారా అందించే సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరింత మందికి చేరవేయాలని సూచించారు.

సీడీపీఓ మధురిమ మాట్లాడుతూ.. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, కొందరు తల్లులు పిల్లలకు బయటి ఆహారాన్ని అలవాటు చేయడం వల్ల వారు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. ఇంటి పెరట్లోనే కూరగాయలు పెంచుకుని, వాటితో ఇంట్లోనే పౌష్టికాహారం తయారు చేసుకుని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ గణేష్ మాట్లాడుతూ.. తాజా చేపలు, ఎండుచేపల ద్వారా కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయని వివరించారు. మాంసాహారం తీసుకునేవారు తమ ఆహారంలో చేపలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం సాగుభూమి సంరక్షణ అంశంపై కూడా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ జ్యోతి, సూపర్‌వైజర్ అరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, స్థానిక అంగన్వాడీ టీచర్ నల్ల భారతి ప్రసంగించారు. ఆయా సునీత, ఏఎన్ఎం కవిత, అంగన్వాడీ టీచర్లు గొఱ్ఱె రాధ, బత్తిని శిరీష, ఎండీ గౌసియా, ఏఎల్ఎంఎస్‌సీ సభ్యులు రాజమణి, చంకీస అనిత, చామంతుల మానస, గూడూరు రమ్య, ఆశా కార్యకర్తలతో పాటు సుమారు 50 మంది తల్లులు పాల్గొన్నారు.