BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 09:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాచలం రామాలయ ప్రాంగణంలో దారుణం.. గది కోసం వచ్చిన యాత్రికుడిపై దాడి.. మృతి

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 09:29 PM
35 వీక్షణలు

మణికంఠ ప్రైవేట్ లాడ్జిలో ఘటన.. మృతుడు తెల్లం శరత్‌..

నిందితులు పరారీ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామాలయానికి వచ్చిన ఓ యాత్రికుడు లాడ్జిలో గది కోసం వెళ్లగా, అక్కడ జరిగిన వివాదం చివరకు ప్రాణాలు తీసిన ఘటనగా మారింది. ఆలయ ప్రాంగణంలోని మణికంఠ ప్రైవేట్ లాడ్జిలో గది కోసం వచ్చిన తెల్లం శరత్‌కు లాడ్జి యజమాని, ఆయన అనుచరుడితో వివాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. అనంతరం శరత్‌పై ఇద్దరూ విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో భద్రాచలంలో కలకలం రేగింది. పవిత్ర పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వచ్చిన యాత్రికుడు లాడ్జిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఘటన అనంతరం పరారైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, దాడికి సంబంధించిన వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.