BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 09:17 pm
Posted by : బాల్ధా భాస్కర్

అర్హులైన పేదలకు చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
17 Nov, 2026 - 09:17 PM
21 వీక్షణలు

పెన్షన్లు లబ్ధిదారులకు వరం లాంటివి: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా | బీబీనగర్ | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం బీబీనగర్ పట్టణంలోని పీఆర్‌జీ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అర్హులైన పేద లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ల మంజూరు ప్రొసీడింగ్స్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లు వరం లాంటివని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గీత కార్మికులు, నేతన్నలు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోలి పింగల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సురకంటి సతీ రెడ్డి, బీబీనగర్ పట్టణ అధ్యక్షుడు టంటం రాఘవేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.