BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:27 pm
Posted by : K MAHESH

మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 08:27 PM
20 వీక్షణలు

రైతుల రుణమాఫీతో పాటు కొత్త రుణాలు మంజూరు చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి

మహబూబాబాద్ జిల్లా | గార్ల | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు.

మంగళవారం గార్ల మండల కేంద్రంలోని గిరి ప్రసాద్ భవన్‌లో ధరావత్ వీరన్న అధ్యక్షతన నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో విజయ సారథి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పుల భారంతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.

జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను సీపీఐ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్ ఎదుట ధర్నా కూడా నిర్వహించామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడం విచారకరమన్నారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు.

పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు రైతుల పాత రుణాలను పూర్తిగా మాఫీ చేసి, తదుపరి సాగు కోసం కొత్త రుణాలు మంజూరు చేయాలని విజయ సారథి డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పశువులకు అవసరమైన దాణా, నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా పెట్టాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని విజయ సారథి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు కృష్ణమూర్తి, మెదరమెట్ల గిరి ప్రసాద్, భూక్యా హరినాయక్, బోగెల్లి కోటేశ్వరి, లావుడియా బీముడు తదితరులు పాల్గొన్నారు.