BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:26 pm
Posted by : K MAHESH

సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 08:26 PM
18 వీక్షణలు

కుమారస్వామి, అతని కుటుంబ సభ్యులను చట్టప్రకారం శిక్షించాలి: సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు

మహబూబాబాద్ జిల్లా | నెల్లికుదురు | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన సుస్మిత మరణానికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారస్వామితో పాటు అతని కుటుంబ సభ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఇసంపల్లి సైదులు మాట్లాడుతూ.. సుస్మితను అదే గ్రామానికి చెందిన కుమారస్వామి గత రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆరోపించారు. ఆమెతో మానసికంగా, శారీరకంగా సంబంధం కొనసాగించిన అనంతరం, కులం పేరుతో కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదనే కారణంతో పెళ్లికి నిరాకరించాడని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో మానసికంగా కుంగిపోయిన సుస్మిత తనకు జరిగిన అన్యాయాన్ని రాతపూర్వకంగా వివరించిందని తెలిపారు.

సుస్మిత మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, ఆమెకు అన్యాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారస్వామితో పాటు అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్రపై కూడా విచారణ జరిపించాలని సైదులు డిమాండ్ చేశారు. బాధ్యులుగా నిర్ధారణ అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

దళితులపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ఒక దళిత యువతి మరణించిన నేపథ్యంలో ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారీగా పోలీసు బందోబస్తు కల్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి, వివాహానికి నిరాకరించే ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సైదులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధ్యులకు మద్దతుగా నిలిచే రాజకీయ నాయకులు లేదా అధికారులు ఎవరైనా ఉంటే, వారిపైనా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.