BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:41 pm
Posted by : K MAHESH

డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు?

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:41 PM
46 వీక్షణలు

వ్యక్తిగత అభ్యంతరాలతో పనులు నిలిచిపోతున్నాయంటున్న 13వ వార్డు ప్రజలు

బయ్యారం | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని 13వ వార్డులో జాతీయ రహదారిని ఆనుకొని నివసిస్తున్న ప్రజలు రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు సంబంధిత అధికారులతో పాటు డీఎల్‌పీఓను కలిసి వినతిపత్రాలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ, పనులు ప్రారంభించే సమయంలో ఓ వ్యక్తి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో మురుగునీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక పరిసర ప్రాంతాల్లోనే నిల్వ ఉంటోందని చెబుతున్నారు.

మరోవైపు మిషన్ భగీరథ పైపులైన్లు దెబ్బతినడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ వీధిలో బావులు, బోర్లు వంటి ప్రత్యామ్నాయ నీటి వనరులు లేకపోవడంతో తాము పూర్తిగా మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగునీటి సమస్యతో పాటు తాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంపై 13వ వార్డు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను పరిశీలించి, పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.