BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండగట్టు ఆంజనేయ స్వామి చందనోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:35 PM
24 వీక్షణలు

60 ఏళ్ల అనంతరం నిర్వహించనున్న చందనోత్సవ మహోత్సవానికి హాజరుకావాలని విజ్ఞప్తి

కొండగట్టు, నవంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దాదాపు ఆరు దశాబ్దాల అనంతరం నిర్వహించనున్న చందనోత్సవ మహోత్సవానికి హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆహ్వానించారు. ఈ మేరకు చందనోత్సవ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి విశిష్ట చందనోత్సవ మహోత్సవంలో పాల్గొని ఆంజనేయ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వారు ప్రత్యేకంగా కోరారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు విశేష ప్రాధాన్యత ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డితో పాటు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.