BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 18 November 2026, 05:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లాలో ఆక్వాన్ తుపాను హెచ్చరికలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 05:31 AM
11 వీక్షణలు

మూడు రోజుల పాటు భారీ వర్షాలు నవంబర్ 19 నుంచి 21 వరకు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి.. నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు ఎన్టీఆర్ జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్ తుపాను ప్రభావంతో నవంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామపంచాయతీ అధికారి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను ముందుగానే పరిశీలించాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంకులు, పైపులైన్లను తనిఖీ చేసి క్లోరినేషన్ చేపట్టాలని, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురుగు నీరు నిలిచే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఫాగింగ్, సూపర్ క్లోరినేషన్, సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రధాన మురుగు కాలువలు, కల్వర్టుల్లో పూడిక తొలగించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే హెచ్చరికలను దండోరా, మైకుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని, పాత గోడల సమీపంలో ఉండేవారిని ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటిముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు, కాలువ గట్ల వెంట నివసించే ప్రజలను గుర్తించి అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మండల, గ్రామస్థాయిలో 24 గంటలు పనిచేసే నియంత్రణ కేంద్రాలతో క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తుపాను సమయంలో అత్యవసర సహాయక చర్యలకు అవసరమైన ఇసుక బస్తాలు, తాళ్లు, పారలు, గొడ్డళ్లు, టార్చిలైట్లు, జనరేటర్లు, జేసీబీలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు వాలినా, తీగలు తెగిపడినా ప్రజలను దూరంగా ఉంచి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్ల ఎండుకొమ్మలను ముందుగానే తొలగించాలని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభుత్వ, ప్రజా ఆస్తులు, రహదారులు, పంటలకు జరిగే నష్టాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సంసిద్ధత, నష్టాల వివరాలతో నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. అత్యవసర వాహనాలు, జనరేటర్ల వినియోగానికి సరిపడా డీజిల్, పెట్రోల్ నిల్వలు సిద్ధం చేసుకోవాలని, క్రేన్లు, ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లను ముందుగానే గుర్తించి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు పంచాయతీ కార్యదర్శులు, స్వర్ణ గ్రామ సిబ్బంది గ్రామ ప్రధాన కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా విధుల ప్రాంతాన్ని విడిచిపెట్టరాదని ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తమ కార్యాలయాల్లో ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని, వాటి వివరాలు, సంప్రదింపు నంబర్లను దండోరా, మైకుల ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేయాలని జిల్లా గ్రామపంచాయతీ అధికారి ఆదేశించారు. ఈ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం లేదా అలసత్వం వహించే సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.