BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:39 pm
Posted by : K MAHESH

అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:39 PM
34 వీక్షణలు

నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా | రామన్నపేట | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

అర్హులైన పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గౌడ, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చేయూత పింఛన్లను మంజూరు చేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

మంగళవారం రామన్నపేట మండలంలోని జేపీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలానికి మంజూరైన నూతన చేయూత పింఛన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి, వలిగొండ–రామన్నపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, జిల్లా నాయకులు గంగుల వెంకట్, రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కందిమల్ల గోపాల్ రెడ్డి, సర్పంచులు మారేపల్లి మల్లారెడ్డి, పూస బాలకిషన్, ఉపసర్పంచ్ మోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే వనం చంద్రశేఖర్, ఎండీ రెహాన్, ఎండీ జమీరుద్దీన్, రామిని రమేష్, శంబాల వెంకటేష్, ఎండీ అక్రమ్, మండల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, లబ్ధిదారులు హాజరయ్యారు.