BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:28 pm
Posted by : K MAHESH

బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 08:28 PM
19 వీక్షణలు

డిసెంబర్ 14, 15 తేదీల్లో రాంలీలా మైదానంలో బీసీల జనభేరి సభకు తరలిరావాలి: డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

వరంగల్ జిల్లా | చెన్నారావుపేట | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

బీసీల హక్కుల సాధన, జనగణనలో బీసీ కులాల వివరాల నమోదును డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న బీసీల జనభేరి సభకు సంబంధించిన గోడపత్రికలను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆవిష్కరించారు.

చెన్నారావుపేట మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల సంఘం నాయకులతో కలిసి ‘హలో బీసీ.. ఛలో ఢిల్లీ’ నినాదంతో రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ దేశ జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన తగిన రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా బీసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి కొనసాగుతోందని అన్నారు.

పలు రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే ప్రయత్నాలు చేసినప్పటికీ, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే న్యాయపరమైన పరిమితుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటా అందడం లేదని విమర్శించారు. మరోవైపు అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కల్పిస్తున్న రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటికైనా బీసీ కులాల జనాభా లెక్కల విషయంలో రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని డ్యాగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన ప్రశ్నావళిలో బీసీల కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని కోరారు.

ఈ డిమాండ్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న బీసీల జనభేరి సభకు బీసీ కులాల ప్రజలు, సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ కార్యదర్శి నూనె రంజిత్ కుమార్ ముదిరాజ్, చెన్నారావుపేట మండల మహిళా అధ్యక్షురాలు బండి విజయ, బహుజన నాయకుడు జన్ను శ్రీనివాస్ బాబు, రజక సంఘం మండల అధ్యక్షుడు సంగెం రాంచంద్రు, బీసీ నాయకులు జినుకల నవనీత్, గుర్రం రవి, ఉప్పుల బిక్షపతి, సూత్రపు సుధాకర్, ఉప్పుల వీరస్వామి, మర్రి రమేష్, గుండం విష్ణు, తడుక రాజు, బల్లె సాయిరాం గౌడ్, మెంతుల రమేష్, పోలెపెల్లి యాకాంబ్రం, కొత్తపెల్లి రాజు, గుర్రం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.