BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 02:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో రూ.1.33 కోట్ల నిధుల గోల్‌మాల్‌ ఆరోపణలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 02:52 PM
9 వీక్షణలు

పోలీసుల సంక్షేమ నిధులు పక్కదారి పట్టించినట్లు ఇద్దరు క్యాంప్‌ క్లర్కులపై అభియోగాలు

హైదరాబాద్, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): హైదరాబాద్‌ సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (CAR) హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసుల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ధోబీ, బార్బర్‌, స్పోర్ట్స్‌, యూనిట్‌, రిక్రియేషన్‌ తదితర విభాగాలకు కేటాయించిన నిధుల్లో సుమారు రూ.1.33 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అంతర్గత ఆడిట్‌లో గుర్తించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో ఇద్దరు క్యాంప్‌ క్లర్కులు బి. వినయ్‌ కుమార్‌, మోసిన్‌ జలాల్‌పై నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 12 మంది వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు ఆడిట్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. బ్యాంకు చెక్కులపై అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నగదు డ్రా చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసుకు సంబంధించి బి. వినయ్‌ కుమార్‌, మోసిన్‌ జలాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిధుల మళ్లింపు, చెక్కులపై సంతకాల ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.