BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 12:48 pm
Posted by : PEDDABOINA SRIKANTH

గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
18 Nov, 2026 - 12:48 PM
15 వీక్షణలు

మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు ఆమోదం.. రైతులు, గ్రామస్థుల హర్షం

ఎల్కతుర్తి | నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని గోపాలపూర్ గ్రామానికి రూ.3 కోట్ల 45 లక్షల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఈ సబ్‌స్టేషన్‌కు నిధులు మంజూరైనట్లు స్థానికులు తెలిపారు.

సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే గోపాలపూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ పనులకు సంబంధించి విద్యుత్ శాఖ తరఫున ఎస్‌ఈ స్వామి నాయక్, డీఈ గణేష్, ఏడీ వంశీకృష్ణ, ఏఈ సుధాకర్, లైన్ ఇన్‌స్పెక్టర్ ఈరానాయక్, లైన్‌మెన్ కుమారస్వామి తదితరులు వ్యవహరిస్తున్నారు.

గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపి రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గోపాలపూర్ గ్రామ ప్రజలు, రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.