BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 02:50 pm
Posted by : PAGADALA DEVAIAH

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
18 Nov, 2026 - 02:50 PM
7 వీక్షణలు

లబ్ధిదారుల సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులను కలిసిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 19 నుంచి అర్హులైన వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పెన్షన్ జాబితాలు, పంపిణీ వివరాలపై స్పష్టత లేకపోవడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు.

పెన్షన్ వివరాల కోసం వృద్ధులు, వికలాంగులు స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ వివరాలు తెలుసుకోవాలనే అంశాలపై సరైన సమాచారం అందడం లేదని తెలిపారు. అర్హులైన కొందరి పేర్లు జాబితాలో లేకపోవడం, పేర్లు ఉన్నవారికి కూడా పంపిణీ వివరాలు తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఫిర్యాదులపై స్పందించిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సరూర్‌నగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి సంబంధిత యూసీడీ సిబ్బంది సైదులును కలిసి పెన్షన్ల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన పెన్షన్ కోసం వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

పెన్షన్ జాబితాలో పేర్లు లేని అర్హుల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, జాబితాలో పేర్లు ఉన్నవారికి పెన్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా అందజేస్తారనే విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. సాంకేతిక కారణాలు లేదా సమన్వయ లోపం వల్ల అర్హులు పెన్షన్ పొందలేని పరిస్థితి ఏర్పడితే వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన యూసీడీ సిబ్బంది సైదులు పెన్షన్ జాబితాలను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.