BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 02:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 02:48 PM
12 వీక్షణలు

మరో నలుగురికి తీవ్ర గాయాలు.. చెట్టును ఢీకొన్న కారు

మాగడి, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): కర్ణాటకలోని మాగడి తాలూకా గుడెమారనహళ్లి హ్యాండ్‌పోస్ట్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి కుణిగల్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కాలేజీ విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు.

కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో గానవి, వైష్ణవి (20) మృతి చెందగా, మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా యాక్టివిటీ క్లాస్‌కు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు సమాచారం.

క్షతగాత్రుల్లో ఇద్దరిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి, మరో ఇద్దరిని నెలమంగల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెలమంగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.