BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 28 November 2026, 07:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆధార్‌ కార్డులో పేరు మార్పునకు రూ.10 వేల లంచం.. ఏలూరు ఎమ్మార్వో రవీంద్రనాథ్‌పై ఏసీబీ పంజా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Nov, 2026 - 07:20 AM
6 వీక్షణలు

గోపాలం పేరును గోపిగా మార్చుకునేందుకు అఫిడవిట్‌ కోసం లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఏలూరు: ఆధార్‌ కార్డులో పేరులో మార్పు చేసుకునేందుకు అవసరమైన అఫిడవిట్‌ కోసం వెళ్లిన వ్యక్తికి లంచం వేధింపులు ఎదురైనట్లు వెలుగులోకి వచ్చింది. గోపాలం అనే పేరును గోపిగా మార్చుకునేందుకు అఫిడవిట్‌ కావాలని కోరగా, ఇందుకోసం రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఏలూరు ఎమ్మార్వో రవీంద్రనాథ్‌ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం జిల్లాలో సంచలనం రేపింది.


ఫిర్యాదుదారుడు జంగం గోపాలం (40) ఏలూరు తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన పేరును ‘జంగం గోపాలన్‌’ నుంచి ‘జినగం గోపి’గా మార్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటన ప్రచురించాల్సి ఉంది. ఇందుకోసం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అధికారిక అనుమతి పత్రం (మెమో) జారీ చేయాలని కోరారు. ఈ పనికి రూ.10 వేలు ఇవ్వాలని అధికారి డిమాండ్‌ చేసినట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏలూరు రేంజ్‌ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో శుక్రవారం మధ్యాహ్నం ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వలపన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేల నగదు తీసుకుంటున్న సమయంలో శెట్టి వెంకట రవీంద్రనాథ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను పరిశీలించారు. ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన బాధ్యతాయుతమైన అధికారి లంచం కేసులో పట్టుబడటం ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపింది. 

+1